కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్నీ విధాల కష్టపడుతున్న విషయం తెలిసిందే.  ఓ వైపు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తూనే, మరోవైపు ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం చేస్తున్న చంద్రబాబు, ఈ కరోనా వైరస్ దెబ్బకు కాస్త మారినట్లు కనబడుతుంది. ఆయన రాజకీయం చేయడం మానేసి, కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు ప్రజలకు పలు సూచనలు, జాగ్రత్తలు చెబుతున్నారు.

 

అదేవిధంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కష్టపడుతున్న జగన్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే కుటుంబం నుంచి 10 లక్షల సాయం, పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతాన్ని సి‌ఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఇక తాజాగా కూడా ఆయన ప్రభుత్వానికి మద్ధతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ చేసిన తర్వాత చాలా మంది తెలంగాణ నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న సమయంలో వారిని అనుమతించలేమని జగన్ తేల్చి చెప్పారు.

 

ఈ నిర్ణయం బాధ కలిగించేది అయిన తీసుకోవడం తప్పడం లేదని అన్నారు. ఇక జగన్ తీసుకున్న కఠిన నిర్ణయానికి చంద్రబాబు కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ ప్రయాణాలు చేయకూడదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

అలాగే ప్రజలు కూడా సమన్వయంగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని, కొన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలు ఓర్పుతో ఉండాలని కోరారు. అయితే చంద్రబాబు మాటల్లో రాజకీయం పెద్దగా ఉన్నట్లు అనిపించడం లేదు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని, చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి పూర్తి మద్ధతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: