దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులో ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో ఈ వైరస్ పడగ విప్పిన పాముల చెలరేగి పోతుంది. మరణాల సంఖ్య పెద్దగా ఏమీ లేకపోయినా గాని పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది నమోదు కావడం తో ఇప్పుడు అందరిలో భయాందోళన నెలకొంది. అయితే సౌత్ ఇండియా లో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఎక్కడికక్కడ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ వేస్తున్న అడుగులు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ లోకల్ ప్రజల నుండి కాక విదేశాల నుండి వచ్చిన వాళ్ల ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతున్నట్లు లెక్కలు చెబుతున్న తరుణంలో...ముందుగా వైయస్ జగన్ సర్కార్ విదేశాల నుండి వచ్చిన వాళ్ళని ఇంటికి పరిమితం చేసి బయటకు రాకుండా, వ్యాధి వేరే వాళ్ళకి సోకకుండా కాపాడటం జరిగింది. ఒకవేళ విదేశాల నుండి వచ్చిన వాళ్లకి ఈ వ్యాధి లేకపోయినా గాని క్వారంటైన్ చేయాలని రెండు వారాల పాటు ఇంటికే పరిమితం కావాలని కట్టుదిట్టమైన రూల్స్ తో ఎక్కడి వారిని అక్కడ ఉండే విధంగా వైయస్ జగన్ సరైన చర్యలు చేపట్టారు.

 

దీంతో చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి కరోనా వైరస్ ఉంది అన్న దాని విషయంలో సర్కార్ వద్ద సరైన స్పష్టత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువకులు ఉద్యోగస్తులు ఒక్కసారిగా రాష్ట్రానికి వచ్చే ప్రయత్నం ఇటీవల చేయడం జరిగింది. ఆ సమయంలో ఏపీ తెలంగాణ బోర్డర్ వద్ద పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అది అతి పెద్ద ఇష్యూ గా మీడియా చిత్రీకరించడం జరిగింది.  ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని...హైదరాబాదు నుండి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని...కాబట్టి ఒక్కరికి వచ్చిన మిగతా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి అంటూ దయచేసి రావొద్దు అంటూ దండం పెట్టడం జరిగింది.

 

ఇలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ సోకే సమస్య ఉండదని మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే చాలా బాగుంటుందని 21 రోజులు షట్ డౌన్ నిబంధన అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రాష్ట్రంలోకి రాణించడం జరుగుతుందని జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్న….ఏపీ రాష్ట్ర ప్రజలు మాత్రం జై కొడుతున్నారు. ఖచ్చితంగా వందకి 100% జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బయటపడని వైరస్ ...ఏప్రిల్ 14 లోపు బయటపడటం గ్యారెంటీ అని అదేవిధంగా వేరే ప్రాంతంలో ఉన్న ఆంధ్ర కి చెందిన వాళ్లకి కూడా వైరస్ ఉంటే బయటపడుతుందని మంచి నిర్ణయమని పొగుడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: