ఎక్కడో పుట్టింది.. దేశాలు దాటుకుంటూ వచ్చి మన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్న మహమ్మారి కరోనా ప్రభావం ప్రభుత్వాల చేతిలో కూడా లేకుండా తీవ్రతను పెంచుకుంటూ వస్తున్నారు.. అందుకే ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తుంది.. అయినా ఆ మహమ్మారి ని కట్టడి చేయలేక పోతుంది .. అందుకే ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.. 

 

 

 

కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది.. ఈ మేరకు ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ వస్తున్నారు.. ఎవరికైనా ప్రాణం విలువ ఒకటే కదా ... కరోనా ను అందరూ ఏకమై పారద్రోలడానికి నడుం కట్టి మరీ ముందుకు కదలి వస్తున్నారు..అయితే ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చాలా చర్యలను చేపడుతుంది.. ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనికీలు నిర్వహించారు.. 

 

 

 

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని అక్కడే ఉండేలా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది..లాక్ డౌన్ పేరుతో ప్రభుత్వం ఎంత నివారణ చేపట్టిన కూడా కరోనా ఉగ్రరూపం మాత్రం తగ్గలేదు ... ఈ లాక్ డౌన్ ను రెండు నెలల వరకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.. ఇకపోతే ప్రజలు ఎటువంటి పనిలేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ మేరకు సినీ రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది విరాళాన్ని అందించి పెద్ద మనసును చాటుకున్నారు.. 

 

 

 

మరో విషయమేంటంటే కరోనా పై లాక్ డౌన్ ప్రకటించిన జన సంచారం  లేకున్నా కూడా మహమ్మారి ప్రభావం మాత్రం ఎక్కడ తగ్గినట్లు కనిపించలేదు.. అందుకోసం ప్రభుత్వం మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.. అదేంటంటే లాక్ డౌన్ ను మరి కొద్ది రోజులు అంటే 50 రోజులకు పొడిగించనున్నట్లు ప్రకటించింది... డబల్యు హెచ్ ఓ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని తెలుస్తుంది..  అయితే కొద్దీ రోజులు మాత్రం నిత్యావసర సరుకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట...తెలంగాణలో ఇప్పటికే ఈ పద్దతి అమలులో ఉంది .. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: