కరోనా మహమ్మారి ఉన్న కొద్దీ విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో దేశంలో ఎక్కడి వాళ్ళు అక్కడికి పరిమితమయ్యారు. ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రావటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసుల సూచనల మేరకు కూరగాయలు మరియు నిత్యావసరాలు సరుకులు కోసం మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన టైం కి బయటకు వచ్చి తమ పనులు చేసుకుని మళ్ళీ ఇళ్లకు వెళ్లి పోతున్నారు. ఇటువంటి తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కరోనా వైరస్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

కరోనా వైరస్ అరికట్టడంలో జగన్ తీసుకువచ్చిన వాలెంటర్ల సిస్టం చాలా అద్భుతం అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వాళ్లకి ఎక్కువగా ఉండటంతో వెంటనే ఇటువంటి వాళ్ళని గ్రామ వాలంటీర్ల ద్వారా ఎక్కడి వారిని అక్కడ గుర్తు పట్టి ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకుంటూ అద్భుతంగా వైరస్ ఉన్నా లేకపోయినా గాని అతని వల్ల ఎవరికీ నష్టం రాకుండా వైయస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే ఈ ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలపై వ్యవహరిస్తున్న తీరుపై కొన్ని సూచనలు ఉండవల్లి ఇచ్చారు.

 

ఎవరైనా అవసరం వస్తే బయటకు వస్తారు వాళ్లపై మరీ దారుణంగా కర్కశంగా కొట్టకుండా ముందు మాటలతో చెప్పు తర్వాత కొద్దిగా గట్టిగా చెబితే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. ఇదే టైములో వైయస్ జగన్  కూడు, గూడు లేని వారి కోసం పేద వారి కోసం 1902 అనే నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించి ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా దానికి డైల్ చేయమని పిలుపునివ్వడం సంతోషించదగ్గ నిర్ణయం అని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఇంకా బయటపడే అవకాశం మరికొద్ది రోజుల్లో ఉండటంతో వాలంటీర్లతో ఇంటింటికి మరోసారి ఆరోగ్య సర్వే కి ఆదేశించామని వెల్లడించారు. దీంతో జగన్ ఇమేజ్ పెంచాలంటే కచ్చితంగా ఉండవల్లి చెప్పింది చేయాలి...అదే విధంగా పోలీసులు కూడా కొద్దిగా సీరియస్ గా కాకుండా మాటలతో చెబితే బాగుంటుంది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: