ప్రపంచం మొత్తం ఒకటే మాట.. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది.. ఈ మేరకు ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ వస్తున్నారు.. ఎవరికైనా ప్రాణం విలువ ఒకటే కదా ... కరోనా కారణంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు ..అయితే ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చాలా చర్యలను చేపడుతుంది.. ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనికీలు నిర్వహించారు..

 

 

 

 

అసలు విషయానికొస్తే...  డౌన్ పేరుతో ప్రభుత్వం ఎంత నివారణ చేపట్టిన కూడా కరోనా ఉగ్రరూపం మాత్రం తగ్గలేదు ... ఈ లాక్ డౌన్ ను రెండు నెలల వరకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.. ఇకపోతే ప్రజలు ఎటువంటి పనిలేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ మేరకు సినీ రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది విరాళాన్ని అందించి పెద్ద మనసును చాటుకున్నారు..

 

 

 

 

 

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 

 

 

 

 

కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు. కాగా, భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 851కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 20 మరణాలు సంభవించాయి. ఇంకా పలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి సమాచారం..కరోనా మహమ్మారి ప్రజలకు అనేక. ఇబ్బందులు కలిగిస్తూ వస్తుంది ..ఇప్పుడేమో ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది.. కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: