మన రాష్ట్రాల్లో అంత్యంత దయనీయమైన పరిస్దితులు నెలకొన్నాయి.. కరోనా వచ్చి కర్ఫ్యూ విధించడంతో ఎక్కడి వారు అక్కడే తలదాచుకోవలసిన పరిస్దితులు తలెత్తాయి.. ఈ క్రమంలో చాలామంది సొంతూళ్లకు వెళ్లలేక, అద్దె ఇళ్లలో ఉండలేక నానా కష్టాలు పడుతున్నారు.. మరికొందరు తమ ఊరుకు వెళ్లాలనే ఆరాటంలో ప్రమాదాలను కొనితెచ్చు కుంటున్నారు.. ఇక కూలీ పనుల కోసం పట్నం వచ్చిన వారి పరిస్దితి అయితే మరీ దారుణంగా ఉంది.. ఇకపోతే కొందరు తమ ఊర్లకు వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న కొందరు మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు..

 

 

ఇలాగే చేసిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఐదుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసాయి.. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటకకు చెందిన కూలీలు, కరోనా ఎఫెక్ట్, వల్ల దేశమంతా లాక్‌డౌన్ ఉండటంతో. ఒక టాటా ఏస్ మాట్లాడుకుని, ఆ వాహనంలో తమ సొంత ఊళ్లకు వెళుతుండగా, పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది.. కాగా ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్దలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని.. మృత దేహాలను స్వాధీ చేసుకుని పోస్ట్‌మార్ట్‌మ్ కోసం ఆస్పత్రికి పంపించారు.

 

 

ఇదిలా ఉండగా రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ లో ఉండగా, హైదరాబాద్‌తో పాటూ చుట్టుపక్కల జిల్లాల్లో చాలామంది కూలీలు చిక్కుకుపోయారు. ఇక్కడ పనులు లేక పస్తూలు ఉండవలసి వస్తుందన్న బాధతో వీరంతా తమ సొంత ఊళ్లకు వెళ్లాలనే ఆరాటంలో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అనుమతించడం లేదు. ఎక్కడివారు అక్కడే ఉండాలని క్లియర్‌గా చెప్పింది. అయినా వినకుండా కొంతమంది కూలీలు ఇలా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు సొంత ఊళ్లకు కాలి నడకన బయల్దేరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: