రోజు రోజుకు కరోనా అనే రావణాసురుడు విజృంభిస్తున్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాల స్కూళ్లకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. అలాగే పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇదే కాకుండా ఏపీపీఎస్సీతో పాటూ మరికొన్ని పరీక్షలు కూడా వాయిదా వేశారు. అంతే కాకుండా స్కూల్ విద్యార్థులు.. పై తరగతులకు వెళ్లాలంటే విద్యా సంవత్సరం చివర్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేక పోవడంతో పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి..

 

 

కాగా ఆరోవ తరగతి చదివే వారి నుండి తొమ్మిదోవ త్యరగతి వరకు ఇది వర్తిస్తుంది.. మరి పదోతరగతి విద్యార్ధుల పరిస్ది ఏంటో తెలియదు.. వీరు తప్పని సరిగ్గా పరీక్ష రాయాలంటే మాత్రం.. పరీక్షలు నిర్వహించాలి.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో అది వీలుపడదు.. ఈ సమయంలో కాంగ్రెస్ ఏపీలో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది.. అదేమంటే.. కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, కరోనా విస్తృతి దృష్ట్యా ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

 

 

అవసరమైతే  ప్రభుత్వం.. విద్యార్ధులు ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా నిబంధన తీసుకు రావాలని, ముఖ్యమనుకుంటే కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని పేర్కొంటున్నారు.. మరి వీరి డిమాండ్‌ను ప్రభుత్వం స్వీకరించి పదోతరగతి విద్యార్ధులకు ఈ వెలుసుబాటు కలిగిస్తుందో లేదో తెలియ వలసింది ఉంది..

 

 

ఇదిలా ఉండగా ఇప్పటికే స్కూల్ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతికి ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: