ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. అమెరికాలోని న్యూయార్క్, ఇంకా తదితర ప్రాంతాలలో కూడా రోజుకి వందల మంది ప్రాణాలను తీసేస్తుంది ఈ కరోనా వైరస్. కోవిడ్ 19 వ్యాధిని అరికట్టేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. దురదృష్టవశాత్తు ఆ దేశంలో కరోనా అనుమానితుల సంఖ్య లక్షల్లో పెరుగుతుండడంతో... ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయడానికి టెస్టింగ్ కిట్లు సరిపోవడం లేదు. అమెరికా పరిశ్రమలు కూడా 24x7 పనిచేస్తూ అత్యంత వేగవంతంగా కరోనా టెస్టింగ్ కిట్లను తయారు చేస్తున్నప్పటికీ... అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్లు కరోనా వైరస్ నిర్ధారణకు కనీసం మూడు నుండి ఏడు రోజుల వరకు తీసుకుంటాయి. వాస్తవానికి అమెరికా ప్రభుత్వం దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారందరికి కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తోంది. కానీ వారికి వైరస్ సోకిందో లేదో తెలియజేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా సరికొత్త కరోనా వైరస్ టెస్టింగ్ విధానాన్ని కనుక్కున్నది అబౌట్ అనే ఓ ప్రముఖ అమెరికా సంస్థ. 

 

 


తాజాగా ఈ అబౌట్ ID NOW సంస్థ కొద్ది రోజుల క్రితం వేరే సంస్థ కనిపెట్టిన m2000 కోవిడ్ 19 టెస్టింగ్ సామర్థ్యాలని ఉపయోగించుకొని The abbott ID NOW™ COVID-19 అనే ఓ పోర్టబుల్ డివైస్ ఆధారిత టెస్టింగ్ విధానాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కోవిడ్ 19 టెస్ట్ చేయడానికి వీరు తయారుచేసిన పరికరం చాలా చిన్న సైజు లో ఉంటుంది. అలాగే కోవిడ్ 19 టెస్ట్ చేయడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. ఈ పరికరం కోవిడ్ 19 పాజిటివ్ ఫలితాలను కేవలం 5 నిమిషాల్లో నిర్ధారించగలదు. అలాగే కోవిడ్ 19 నెగిటివ్ అని నిర్ధారించేందుకు 13 నిమిషాలు తీసుకుంటుంది. అబౌట్ ID NOW టెస్టింగ్ ద్వారా రోజుకి 50 వేల మందికి కరోనా వైరస్ టెస్టులను, నెలకి 50 లక్షల టెస్టులను నిర్వహించవచ్చని ఆ సంస్థ చెబుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: