ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది కరోనా వైరస్.  ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 27333కి చేరింది. కరోనా పాజిటివ్ కేసులు 595,953 నమోదు అయ్యాయి. ఇటలీలో అత్యధికంగా 74,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,503 కరోనా మరణాలు సంభవించాయి.  భారత్ లో 748 కేసులు నమోదు కాగా 19 మరణాలు సంబవించాయి. స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి చెందారు. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పటికీ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

 

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. ట్రాన్స్‌మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్‌ను ఉపయోగించి పూణెలోని శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఫొటో తీశారు. ఈ చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది.  చైనాలోని వూహాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి.

 

 

భారత్‌లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వారి నుంచి సేకరించిన రక్త నమూనాలో కరోనా వైరస్ టెస్ట్ చేశారు. ఆ నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్‌ను గుర్తించి ఫొటో తీశారు. ఇది అచ్చం ‘మెర్స్-కోవ్’ వైరస్‌ను పోలి ఉంది.  అయితే ఈ వైరస్ చూడటానికి చూట్టు కిరీటం లా కనిపిస్తుంది.  అందుకే దీనిపైరు కరోనా అని పేరు పెట్టారట. ఇక కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


27333
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: