ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా మహమ్మారితో భయంతో వణికి పోతుంది.  రోజు రోజుకీ పెరిగిపోతున్న మరణాలు ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి.  సాధారణంగా తుఫాన్, వరదలు, భూకంపాలు ఒక ప్రాంతంలో జరుగుతాయి.  సునామీ వచ్చినా ఒక దేశంలో ప్రజలు ప్రాణ నష్టం... ఆస్తి నష్టం వాటిల్లుతుంది.  కానీ చైనా లోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది.. ప్రజలను పట్టి పీడిస్తుంది.  ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది.  గతంలో ఏదైనా అంటురోగాలు ప్రబలినప్పుడు చిన్నదేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యేవి. అయితే కరోనా మహమ్మారి కారణంగా అగ్రరాజ్యాలే ఎక్కువగా విలవిల్లాడుతున్నాయి.

 

కరోనా మహమ్మారి వల్ల చైనా తర్వాత అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు  అల్లాడిపోతున్నాయి. అయితే చైనా పక్కనే ఉన్న చిన్న దేశం వియత్నాంలో కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం విశేషం అని చెప్పాలి. కరోనా పాజిటివ్ కేసులు వియత్నాంలో 200 లోపే. ఇప్పటివరకు ఎవరూ మృతి చెందలేదు. ఎక్కడో ఉన్న దేశాల్లో వీపరీత మరణాలు సంబవిస్తుంటే వియత్నాం లో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా లేదని అంటున్నారు.  కారణాలు ఏమైనా ఇది ఒక విజయమే అంటున్నారు.  వాస్తవానికి వియత్నాం మధ్యతరహా దేశం. వైద్య వ్యవస్థ ఆధునికతను ఇంకా అందిపుచ్చుకోలేదు.

 

రోనాను సమర్థంగా కట్టడి చేయడమే అందుకు నిదర్శనం. చైనాలో కరోనా ప్రభావం గణనీయంగా ఉన్న తరుణంలో వియత్నాం మేల్కొంది.చైనాలో లాక్ డౌన్ జనవరి 20న ప్రారంభం కాగా, జనవరి 1 నుంచే వియత్నాం దశలవారీ లాక్ డౌన్ అమలు చేయడం మొదలుపెట్టింది.  అయితే వియత్నాం కరోనాని అంత తేలిగ్గా తీసుకోలేదు.  ఉగ్రవాదంపై నిఘా తరహాలో కరోనా అనుమానితుల కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వేట సాగించాయి. ఇంట్లోనే ఉండడం ద్వారా కరోనాను రూపుమాపగలమంటూ విస్తృతస్థాయిలో ప్రభుత్వ వర్గాలు సామాజిక ప్రచారం చేశాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


27333
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: