దేశంలో ప్రతిరోజు రెోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి.  ఓ వైపు కరోనా ఎఫెక్ట్ వల్ల దేశమంతా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రోడ్లపై వాహనాలు తక్కువే తిరుగుతున్నాయి.. అయినా రోడ్డు ప్రమాదాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు.  కారణం అతి వేగం, మద్యం సేవించి నడపడం  కర్మకాలితే ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ డిసిఎంను లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

 

పనులు లేకపోవడంతో కర్ణాటకకు చెందిన 30 మంది కూలీలు స్వగ్రామం అయిన రాయచూర్‌కు బొలేరో ట్రక్‌లో బయలుదేరారు. ఔటర్ రింగు రోడ్డు మీది నుంచి వీరు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఓ లారీ.. బొలేరోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలేరో డ్రైవర్ సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఆరుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు.

 

ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు.  అక్కడ పడి ఉన్న మృతదేహాలు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది.  ఓ వైపు లాక్ డౌన్ చేయడంతో  మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సూర్యాపేట నుండి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులంతా కర్ణాటక రాష్ట్రం వాసులుగా గుర్తింపు.  రారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ నూజివీడు నుంచి గుజరాత్‌కు మామిడి కాయల లోడుతో వెళ్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: