ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌న దేశంలో కూడా రోజు రోజుకు విజృంభిస్తోంది. మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ సంఖ్య ఇప్ప‌టికే 800 క్రాస్ అయ్యింది. నిన్న ఒక్క రోజే క‌రోనా పాజిటివ్ కేసులు 116 వ‌ర‌కు వ‌చ్చాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక మ‌న దేశంలో ఈ భ‌యంక‌ర‌మైన మ‌హ‌మ్మారికి సంబంధించిన ఫొటోలు భారత్‌లో తొలిసారిగా విడుదలయ్యాయి. మ‌న‌దేశంలో ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి పుణెలోని ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు కంటికి కనిపించని ఈ వైర‌స్ సూక్ష్మ‌జీవి ఫొటోల‌ను తొలిసారిగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు.

 

ఇక జ‌న‌వ‌రి 30న మ‌న దేశంలో న‌మోదు అయిన తొలి క‌రోనా వైర‌స్ కేసు (కేర‌ళ‌లో తొలిసారిగా న‌మోదైన కేసు ) కు సంబంధించి థ్రోట్‌ స్వాబ్‌(గొంతుకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఉపయోగించే వైద్య పరీక్ష) నుంచి దీనిని వేరు చేసి దీనిని గుర్తించిన‌ట్టు వెల్ల‌డించారు. కేర‌ళ‌కు చెందిన క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తి నుంచి సేకరించిన సాంపిల్స్‌లోని జన్యుక్రమం అటు చైనాలో బ‌య‌ట ప‌డ్డ క‌రోనా వైర‌స్ జ‌న్యుక్ర‌మంతో దాదాపు 99.98 శాతం స‌రిపోలి ఉంది. దీంతో చైనాలోని వుహాన్ వైర‌స్ మ‌న దేశంలో ఉన్న వైర‌స్ ఒక్క‌టే అని నిర్దార‌ణ అయ్యింది.

 

ఇక ఈ వైర‌స్ ఫొటోలు ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో పొందుపరిచారు. ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ నేషనల్‌ ఇన్‌ఫ్లూయెంజా సెంటర్‌ టీం ‘‘ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపి ఇమేజింగ్‌ ఆఫ్‌ సార్స్‌-కోవ్‌-2’’పేరిట ప్ర‌చురించిన వ్యాసంలో ఈ ఫొటో ప్ర‌చురించింది. అంతే కాకుండా ఈ వైర‌స్ ఫొటోల‌ను దేశంలోనే తామే తొలిసారిగా ప్ర‌చురించిన‌ట్టు కూడా స్ప‌ష్టం చేసింది. ఇక క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణం ఎలా సంభవిస్తుందో ?  కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

 

ఈ వైర‌స్ వ‌ల్ల శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తింటుంది. ఆ త‌ర్వాత మ‌న‌షి శ‌రీరంలో మిగిలిన పార్ట్‌ల మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఆ త‌ర్వాత మ‌ర‌ణానికి దారితీస్తుంది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: