ఒక వ్యక్తికి ఉండే పట్టుదలను బట్టి ఆవ్యక్తి సాధించే విజయం ఆధారపడి ఉంటుంది. ఈసందర్భంలో పట్టుదలకు సంబంధించిన 8 లక్షణాలలో ఎన్ని లక్షణాలు మనకు ఉన్నాయో విశ్లేషణ చేసుకుంటే మన పట్టుదల స్థాయి ఏమిటో మనకు అర్ధం అవుతుంది. దీనికోసం మన పట్టుదలకు సంబంధించి అడ్డంగా నిలిచే కొన్ని బలహీనతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


సంపదను కోరుకునే ప్రతి వ్యక్తి ఆ బలహీనతలను గెలిచి తీరాలి అని మనీ ఎక్స్ పర్ట్ లు చెపుతున్నారు. ప్రతి విషయానికి కుంటి సాకులు ఆలోచిస్తూ కారణాలు వెతుక్కోవడం ఏవిషయం పై అయినా ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని సముపార్జించడంలో ఆసక్తి లేకపోవడం పరిస్థితులు ఎదుర్కోవడం కన్నా కాలాన్ని పరిస్థితులను నిందిస్తూ కాలం గడిపే మనస్తత్వం ఉన్నవారు తమ పట్టుదల విషయంలో చివరి వరకు తమ పట్టును కొనసాగించలేరని అనేక ధనం సంపాదించే విషయంలో పరాజితులు అవుతారు అంటూ మనీ ఎక్స్ పర్ట్ లు అభిప్రాయపడుతున్నారు. 


ఇదే సందర్భంలో సమస్యల పరిష్కారానికి సరైన మార్గాలు లేకపోవడం ఆత్మ సంతృప్తి లేకపోవడం వ్యతిరేక పరిస్థితులతో పోరాడే మనస్తత్వం లేనివారు కూడ డబ్బు సంపాదించే విషయంలో బలహీనులుగానే మిగిలిపోతారు అని మనీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి విషయంలోనూ ఓటమి తారసిల్లగానే లక్ష్య సాధనకు స్వస్తి చెప్పే అభిప్రాయం కలవాళ్ళు వ్యవస్థీకృత ప్రణాళికలు లేని వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడంలో వెనకపడే వారు తమ పట్టుదల విషయంలో రాజీలేని పోరాటం చేయలేరని అనేకమంది మనస్తత్వ శాస్త్ర వేత్తల అభిప్రాయం. 


ముఖ్యంగా పేదరికంతో రాజీ పడటం ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉండే విషయంలో వెనకడుగు వేయడం ముఖ్యంగా విమర్శలు అంటే భయపడిపోవడం లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎంత సమర్ధులు అయినా ధనవంతులు కాలేరని మనీ ఎక్స్ పర్ట్ నెపోలియన్ హిల్ అభిప్రాయ పడుతున్నారు. దీనితో ఈ నెగిటివ్ విషయాలను అన్నీ దృష్టిలో పెట్టుకుని మన పట్టుదలను మనమే అంచనా వేసుకోగల స్థితికి చేరుకున్న వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: