కరోనా వైరస్ మూలాన, ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న సంగతి అందరికి తెలిసినదే. ప్రాణ, ధన నష్టాల ఊబిలో వివిధ దేశాలు కూరుకుపోతున్న తరుణంలో, ఆయా స్థితిని నిలువరించేందుకు పెద్దన్న అమెరికా   తన దాతృత్వాన్ని చాటుతూ, ప్రపంచ దేశాలకు అండగా నిలవడానికి సన్నాహాలు చేస్తోంది... ఈ సందర్భంగా... 64 దేశాలకు కలిపి మొత్తం 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది.

 

ఇక ఇందులో కొంత వంతుగా భారత ప్రభుత్వానికి 2.9 మిలియన్‌ డాలర్ల వరకు ఆర్థిక సహాయం అందనున్నట్లుగా సమాచారం. అయితే, ఇది కేవలం కరోనాను అరికట్టేందుకు అవసరమైన ల్యాబ్‌ల అభివృద్ధి, కరోనా బాధితుల పర్యవేక్షణ, అలాగే దీనికి సంబంధించిన సాంకేతికత అభవృద్ధికై ఈ విరాళం ఇస్తున్నట్లు  అమెరికా ప్రభుత్వం పేర్కొనడం విశేషం. అయితే ఆయా నిధులన్నియు.. అంటువ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్న సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ - CDC సహా ఇతర రిలేటెడ్ సంస్థలకు, 'ఈ గ్లోబల్‌ ప్యాకేజీ' ద్వారా నిధులు చేరనున్నాయి. 

 

ఈ సందర్భంగా, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ - USAID డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌ బోనీ గ్లిక్‌ మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా.. అమెరికా చేస్తున్న కృషి ఎనలేనిదని, ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా సరికొత్త రికార్డును సృష్టించిందని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చేస్తున్నదని, మరే ఇతరేతర వాణిజ్య అవసరాల కోసమో కాదని, ఈ విషయంలో అమెరికా ఎన్నో దశాబ్దాలుగా, ప్రపంచ దేశాలకు సహాయం చేయడంలో ముందంజలో ఉందని అన్నారు.

 

వివిధ వర్ణాలు, వర్గాల ప్రజలను కాపాడుకునేందుకు వీలుగా ఆరోగ్య సంస్థలను నెలకొల్పేందుకు అమెరికా సహాయం చేస్తోందని.. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్ లో భాగంగా.. బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 1.3 మిలియన్‌ డాలర్లు, నేపాల్‌కు 1.8 మిలియన్‌ డాలర్లు, అఫ్గనిస్తాన్‌కు 5 మిలియన్‌ డాలర్లు చేరనున్నాయని సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: