ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఏపిలోని ఓ  బిజెపి నేత పెద్ద షాక్ ఇచ్చాడు. కొరోనా వైరస్ నియంత్రణకు ప్రధాని ఇచ్చిన లాక్ డౌన్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేని బిజెపి నేత వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ తేల్చి చెప్పేశాడు. మూడు రోజుల క్రితం తెలంగాణా నుండి ఏపిలోకి ప్రవేశించేందుకు సుమారు 4 వేల మంది ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే  వైరస్ వ్యాప్తి భయంతో  ఏపి పోలీసులు వీళ్ళందరినీ సరిహద్దుల్లోనే నిలిపేశారు. ఇదే విషయమై బిజెపి నేత కోర్టులో కేసు వేశాడు. కోర్టు కూడా వాళ్ళందరినీ పరీక్షించి రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలివ్వటమే విచిత్రంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొరోనా వైరస్ చాలా వేగంగా వ్యపిస్తోందన్న ఉద్దేశ్యంతోనే ప్రధాని దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవాలంటూ ప్రధాని పిలుపినిచ్చారు. ఆ పిలుపును ఉల్లంఘిస్తు వేలాదిమంది ఏపిలోకి ప్రవేశించటానికి ప్రయత్నించినపుడు జగ్గయ్యపేట చెక్ పోస్టు దగ్గర పెద్ద గొడవైంది. స్కీనింగ్ టెస్టు, క్వారంటైన్ సెంటర్లలో ఉండేట్లయితే అనుమతిస్తామని పోలీసులు చెబితే చాలామంది ఒప్పుకోలేదు.  దాంతో ఒప్పుకున్న వాళ్ళని మాత్రం అనుమతించి మిగిలిన వాళ్ళని ఆపేసింది.

 

ఇదే విషయమై బిజెపి నేత కోర్టుకెళితే న్యాయమూర్తి కూడా  పరీక్షలు జరిపి అందరినీ అనుమతించాల్సిందే అంటూ ఆదేశాలివ్వటమే విచిత్రంగా ఉంది. పరీక్షలు చేయించుకోవటానికి, క్వారంటైన్ సెంటర్లలో ఉండటానికి ఇష్టపడకపోతేనే కదా ఏపి ప్రభుత్వం చాలామందిని ఆపేసింది. విషయం ఏమిటో గమనించకుండా ప్రభుత్వంపై ఎవరు కేసు వేసినా వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేయటమే పనిగా పెట్టుకున్నట్లుంది కోర్టు.

 

తెలంగాణాలో నుండి ఏపిలోకి ప్రవేశించాలని అనుకున్న వేలాదిమందిలో కనీసం పదిమందికి వైరస్ ఉన్నా ఎంతమందికి వ్యాపిస్తోందో ఎవరైనా చెప్పగలరా ? పైగా పరీక్షలు చేయించుకోవటానికి నిరాకరించిన వాళ్ళకు కోర్టు బుద్ధి చెప్పకుండా ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధాని స్పూర్తిని బిజెపి నేతలే దెబ్బ కొడుతున్న విషయం తెలిసిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: