కరోనా వైరస్ కోరలు ఝళిపిస్తున్న వేళ, రైల్వే శాఖ కూడా తనవంతు బాధ్యతను చాటుకుంటోంది. ఆ సందర్భంగా.. రైల్వే భోగీలనే ఐసోలేషన్ వార్డులుగా ఏర్పాటు చేయడం ఇక్కడ కొత్తదనం సంతరించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులలో దేశవ్యాప్తంగా రైళ్లు ఆగిపోయిన నేపథ్యంలో, ఖాళీగా వున్న వాటి  బోగీలను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం గమనార్హం.

 

ఈ మధ్యే జరిగిన ఒక మీడియా సమావేశంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోగా, ఇపుడు అందుకు సంబంధించిన ప్రోటో టైప్ కోచ్ లను రైల్వే శాఖ సిద్ధం చేసి, అందరిని అబ్బురపరుస్తోంది. ఇక ఈ నిర్ణయం సరిగ్గా పనిచేస్తే, కనీస  వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్య సదుపాయలను విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

 

ఇక అంతే కాకుండా... ఇండియా మొత్తంలో వినియోగంలో ఉన్న 13వేలకు పైగా రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వలన, బాధితులకు మరిన్ని వైద్య సేవలు చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అభిప్రాయాలు వెళ్లబుచ్చుతున్నారు. ఇంకా ఇలా పలు రకాలైన అష్ట దిగ్భంధన ప్రక్రియలవలన కరోనా వైరస్ ను అతి తొందరగా అరికట్టవచ్చునని వారు ఈ సందర్భంగా చెబుతున్నారు.

 

ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు చేస్తే... దేశం మొత్తంలో 3 లక్షల వరకూ బెడ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. రైల్వే కోచ్ లలో వాష్ రూమ్స్ కూడా అందుబాటులో  ఉన్నందు వలన, వాటిని ఐసోలేషన్ వార్డులుగా కూడా ఉపయోగించవచ్చని వారు సూచనలు చేస్తున్నారు. ఇలా ఒక రోగికి సంబంధించిన అన్ని రకాలైన సదుపాయాలు అక్కడ వున్నందువలన ఈ ఐడియా పైన కేంద్రం దృష్టి పెడితే మరింత సేవలు చేయవచ్చునని..  కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే శాఖ సూచించిందని, వారు తక్షణమే దానికి అంగీకారం తెలిపారని సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: