ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డిసెంబర్‌లో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి బాధితుల సంఖ్య లక్షల‌కు చేరుకోవడానికి ఎంత స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోగా, 5.94 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ ర‌క్క‌సిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది.

 

ఏ మాత్రం ఏమరపాటు ప్రదర్శించినా ఘోర ప్రమాదం జరుగుతుందని చెబుతున్నారు. అందుకే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నాయి. మ‌రియు పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు దాటి బయటికి వస్తే పోలీసులు చితకబాదుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్య‌క్తి త‌న‌కు క‌రోనా సోకిందేమో అని వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి కొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అక్కల వెంకటయ్య (44) హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. 

 

అయితే క‌రోనా నేప‌థ్యంలో ఇటీవల హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామానికి వచ్చాడు వెంకయ్య. ఇక  గ్రామంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు తమ పేర్లను నమోదు వేయించుకోవాలని దండోరా వేయించారు. వెంకటయ్య సైతం తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే గ‌త రెండు రోజులుగా వెంకటయ్య జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే  ‘కొడుకుకు ఫోన్‌ చేసి తనకు కరోనా వైరస్‌ సోకిందేమోనని అనుమానంగా ఉంది. నా వల్ల ఊరంతా వైరస్ వస్తుంది.

 

నేను పోతే దూరంగా ఉండి చూడండి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో వేప‌చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్య కొడుకు అక్కడికి చేరుకునే సరికి ద్వారకపూడి రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని కన్పించాడు. దీంతో పోలీసుల‌కు, కుటుంబ స‌భ్య‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: