ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.  భారత్ లో పుట్టకపోయినా.. విదేశాల నుంచి వచ్చిన వారితో దేశంలోకి కరోనా వైరస్ వచ్చేసింది. రోజురోజుకి కరోనా కేసులు ప్రబలుతోన్న సమయంలో రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాసిన లేఖ సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 27,250 మంది కరోనా వల్ల మృతి చెందారు. 5.94 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు1.33 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత రెండు నెలలుగా విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన 15 లక్షల మందిని పరీక్షించి క్వారంటైన్ నిఘా పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం.

 

ఈ ఏడాది జనవరి 15 నుంచి మార్చి 23వతేదీ వరకు స్వదేశానికి 15 లక్షల మంది తిరిగివచ్చారని, వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి... క్వారంటైన్ నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  అయితే ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసులు దాదాపు అన్నీ విదేశాల నుంచి వచ్చినవారికే కవడం విశేషం.  ఇప్పటి భారత దేశంలో కరోనా వల్ల ఇప్పటి వరకు 20 మంది చనిపోాయారు. 

 

కేరళాలలోని తిరుచ్చిలో నేడు ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఇరవై మంది మృతి చెందారు.  ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరి ఆచూకీ లేదని, వారంతా కనీసం 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.  

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: