కరోనా వైర‌స్‌(కోవిడ్-19).. క్వారంటైన్.. ఐసోలేషన్.. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరి నోట విన్నా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచంవ్యాప్తంగా ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. అలాగే ఈ క‌రోనా ఎఫెక్ట్ మ‌నుషుల‌పైనే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కేంద్ర లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే  లాక్ డౌన్ కార‌ణంగా ప్రజలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బంది పడకుండా పలు చర్యలను తీసుకుంటున్నాయి. 

 

ఇందులో భాగంగా బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐపై మూడు నెలల మారటోరియం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు విషయంలోనూ ఇదే పంథా అనుసరించింది. అలాగే ఆర్బీఐ సైతం ఈఎంఐల చెల్లింపులపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలోని భవన యజమానులు మానవతతా దృక్పథంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి నుంచి రెంట్ వసూలు చేయకూడదని నిర్ణయించారు. సామాన్యుల సంపాదనలో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే సరిపోతుందనే విషయం తెలిసిందే. 

 

దీంతో, ముంబైలోని జుము, అంధేరి ప్రాంతాల్లోని ముగ్గురు భవన యజమానులు వారి టెనెంట్లకు మూడు నెలల పాటు అద్దెనె వసూలు చేయకూడదని నిర్ణయించారు. అలాగే ప్రముఖ సంస్థ లోథా గ్రూప్ కూడా దక్షిణ ముంబైలోని థానే, పూణేల్లోని తమ 200 మంది కమర్షియల్ టెనెంట్లకు అద్దె రద్దు చేశామని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే  ఒక లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రెసిడెంట్ విక్రమ్ మెహతా మాట్లాడుతూ, బిజినెస్ లేకపోతే అద్దె చెల్లించడం కష్టమవుతుందని..అందుకే అద్దె వసూలు చేయవద్దని యజమానులను తాను ఒప్పించానని తెలిపారు. ఏదైతేనేం.. ఇలాంటి మానవ‌త్వం క‌లిగిన మ‌నుషుల వ‌ల్ల కొన్ని కుటుంబాలు ఆర్థిక క‌ష్టాల నుండి కాస్త అయినా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: