కరోనా వైరస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ని ఎలా అయినా సరే అమలు చెయ్యాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. వైరస్ మన దగ్గరకి రాదు మనమే దాని దగ్గరికి వెళ్లి దాన్ని ఆహ్వానించాలి. అది కచ్చితంగా తెలివి తక్కువ పనే. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ని అమలు చేస్తున్నార్. దీనికి ప్రజల నుంచి మాత్రం సహకారం ఉండటం లేదు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. వారి విషయంలో పోలీసులు మాత్రం చాలా అతి చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంత మంది పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే వారిపై కూడా దాడి చేస్తున్నారు. ఈ తరుణంలోనే గుంటూరు జిల్లా నకిరేకల్లు లో ఇష్టం వచ్చినట్టు దాడి చేసాడు ఒక కానిస్టేబుల్. పాలు పోసే రైతుపై దాడి చేసాడు. దీనితో అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

దీనితో అతనిపై చర్యలు తీసుకున్నారు గుంటూరు ఎస్పీ. అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే కౌన్సెలింగ్ ఇవ్వాలి గాని లాఠీ చార్జ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నకిరేకల్ ఎస్సై సహా పలువురు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు పోలీసులపై తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పూర్తిగా విధుల నుంచి తప్పిస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: