దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  దాంతో దేశం మొత్తం అష్టదిగ్బందం అయ్యింది.  ఎక్కడి వారు అక్కడే ఇంటికే పరిమితం అయ్యారు.  దాంతో చిరుద్యోగులు, వ్యాపారస్తులు ఇతర చిన్న చిన్న కంపెనీల్లో చేసేవారు ఇంటికే పరిమితం అయ్యారు.  ఆర్బీఐ సైతం ఈఎంఐల చెల్లింపులపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బంది పడకుండా పలు చర్యలను తీసుకుంటున్నాయి. 

 


దేశంలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ముంబైలోని భవన యజమానులు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి నుంచి రెంట్ వసూలు చేయకూడదని నిర్ణయించారు. ఒక లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రెసిడెంట్ విక్రమ్ మెహతా మాట్లాడుతూ... బిజినెస్ లేకపోతే అద్దె చెల్లించడం కష్టమవుతుందని... అందువల్లే అద్దె వసూలు చేయవద్దని యజమానులను తాను ఒప్పించానని తెలిపారు.  సాధారణంగా చిరుద్యోగులు తమ జీతంలో కొంత భాగం అద్దె చెల్లించడానికే సరిపోతుంది. 

 


దీంతో, ముంబైలోని జుము, అంధేరి ప్రాంతాల్లోని ముగ్గురు భవన యజమానులు వారి టెనెంట్లకు మూడు నెలల పాటు అద్దె వసూలు చేయకూడదని నిర్ణయించారు. ప్రముఖ సంస్థ లోథా గ్రూప్ కూడా దక్షిణ ముంబైలోని థానే, పూణేల్లోని తమ 200 మంది కమర్షియల్ టెనెంట్లకు అద్దె రద్దు చేశామని తెలిపింది.   ప్రస్తుతం దేశం క్లిష్ట సమయంలో ఉంది కనుక ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.  అంతే కాదు పేదలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కాపాడేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: