దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సరిహద్దులను బ్లాక్ చేశాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీహార్ కి చెందిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి కానీ పోలీసులు మాత్రం తాను ప్రయాణిస్తున్న అంబులెన్సు ని అడ్డుకున్నారు. దాంతో ఆమెకి అంబులెన్సు లోనే గర్భస్రావం జరిగింది.




పూర్తి వివరాలు తెలుసుకుంటే... బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన 25ఏళ్ల గౌరీ దేవి, తన భర్తతో కలిసి ఉత్తర కేరళ లోని కాసర్గోడ్ జిల్లా కి వలస వచ్చి స్థానిక ప్లైవుడ్ ఫ్యాక్టరీ లో పనిచేస్తున్నారు. ఐతే ప్రస్తుతం కాసర్గోడ్ జిల్లాలో అధిక కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో అక్కడి ఆసుపత్రిలన్నీ కిటకిటలాడుతున్నాయి. వారు నివాసం ఉంటున్న పట్టణం కర్ణాటక -కేరళ సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో... ఆమె తరచూ సరిహద్దు దాటుతూ  దగ్గరగా ఉన్న   కర్ణాటక రాష్ట్రం మంగళూరు లోని ఓ హాస్పిటల్ డాక్టర్ ని సంప్రదించేది.

 

 

ఐతే ఈరోజు ఆమెకి తీవ్రంగా పురిటి నొప్పులు రావడంతో ఎప్పటి లాగానే తనని మంగళూరు ఆసుపత్రి కి ఓ అంబులెన్సు లో కుటుంబ సభ్యులు తరలిస్తుండగా... సరిహద్దు వద్ద ఆ అంబులెన్సు ని పోలీసులు అడ్డుకున్నారు. కేరళ నుండి వస్తున్న అంబులెన్సు లతో సహా ఇతర వాహనాలు అనుమతించకూడదని తమ ప్రభుత్వం చెప్పినట్టు ఆ పోలీసులు చెబుతూ అంబులెన్సు ని తిరిగిపంపించేసారు. ఐతే అంబులెన్సు డ్రైవర్ హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య అధికారులు తల్లి, బిడ్డ పరిశీలించి వారు క్షేమంగానే ఉన్నారని తెలియజేశారు.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: