క‌రోనా పై యుద్ధం : ఉచ్చ గ్ర‌హం + నీచ గ్ర‌హం + సొంతిల్లు గ్ర‌హం క‌లిశాయ్‌.... క‌రోనా మ‌రింత కోర‌లు చాస్తుందా..!
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఎక్క‌డి వ్య‌వ‌స్థ‌లు అక్క‌డే ఆగిపోతున్నాయి. ఈ టైంలో అస‌లు క‌రోనా ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటుందో ?  కూడా ఎవ్వ‌రు చెప్ప‌లేక‌పోతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్ర‌ముఖ జ్యోతిష్య పండితులు నాగేశ్వ‌ర‌రావు గారు క‌రోనా ప్ర‌భావంపై త‌న‌దైన విశ్లేష‌ణ చేశారు. రేపు ఆదివారంతో గ్ర‌హ స్థితిలో అనేక మార్పులు.. చేర్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని చెప్పారు.



రేపు ఆదివారం మ‌క‌రానికి ఉచ్చ గ్ర‌హం అయిన కుజుడు.. నీచ గ్ర‌హం అయిన గురువు.. మ‌క‌రానికి సొంతిల్లు అయిన శ‌ని గ్ర‌హాలు క‌లుస్తున్నాయ‌ని ఈ ప్ర‌భావం ఏ విష‌యంలో అయినా చాలా విప‌రీతంగా ఉంటుంద‌ని చెప్పారు. ఈ మూడు గ్ర‌హాలు క‌లిసిన నేప‌థ్యంలో ఆదివారం నుంచి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగాను..  మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విప‌రీతంగా పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.



ఈ రెండిట్లో ఏదైనా కూడా జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న వాతావ‌ర‌ణం బ‌ట్టి చూస్తే క‌రోనా విజృంభించేందుకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. అంటే మే 5వ తేదీ వ‌ర‌కు క‌రోనా ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో కూడా అర్థం కాని ప‌రిస్థితి ఉంది. మే 5న‌ కుజుడు కుంభంలో ఉంటాడ‌ని... అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్ర‌భావం కొంత వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని.. అయితే ఆ త‌ర్వాత కూడా క‌రోనా కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంద‌ని చెప్పారు. ఏదేమైనా మే 5 వ తేదీ వ‌ర‌కు క‌రోనాకు బ్రేకులు ప‌డే అవ‌కాశాలు అయితే క‌న‌ప‌డ‌డం లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: