ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను చూసి ప్రజలంతా గడగడా వణికిపోతున్నారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి వ్యాధిగ్రస్థులు అవుతూ ఉండగా వేలాది మంది ప్రతిరోజు మృత్యువాత పడుతున్నారు. అసలు దీనిని ఎలా అరికట్టాలో అర్థంకాక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే వైరస్ గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

అయితే కరోనా నేపథ్యంలో... బ్రహ్మంగారిమఠం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆలయ మేనేజర్‌ ఈశ్వరయ్యచారి ఖండించారు. 'ఆలయంలో పూజారి చనిపోయాడని వస్తున్న వార్త అవాస్తవం. మిరియాలు, అల్లం, బెల్లం కలిపిన నీటిని తాగితే కరోనాను నివారించవచ్చని బ్రహ్మంగారు చెప్పినట్టుగా సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదనీ అవన్నీ అసత్యం అని ఆయన ఆన్నాడు.

 

అయితే బ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానం లోస్పష్టంగా ఒక సూక్ష్మజీవి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది అని కానీ లేదా ప్రజలంతా వ్యాధిబారిన పడి చనిపోతారని ఎక్కడ రాసి లేదట. సరిగ్గా అందులో ఇప్పుడు మనం ఉంటున్న సమయంలో ఉత్తరాది నుండి ఒక ఉపద్రవం వచ్చి దాదాపు సగం మంది జనాభా తుడిచిపెట్టుకుని పోతారు అని మాత్రమే కాలజ్ఞానం లో వ్రాసి ఉంది.

 

మన దేశానికి ఉత్తరాన ఉన్న మొదటి దేశం చైనా కావడంతో కరోనా వైరస్ బయటకు రాగానే అంతా బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుందని…. దీనిని ఎవరు నిలువరించలేరని.... సగం మంది జనాభా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోయి అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కన్నేసి ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: