ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి తెలంగాణ‌లో పంజా విసురుతోందా ?  క‌రోనా పంజా విసిరి ప్రాణాలు తోడేసేందుకు రెడీ అవుతోందా ? మహమ్మారి కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు జ‌రుగుతున్నా ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యం.. అల‌స‌త్వమే ఇప్పుడు తెలంగాణ‌కు మైన‌స్ అవుతోందా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే చెపుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ముందు నుంచి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఈ క్ర‌మంలోనే మార్చి 31 వ‌ర‌కు ఉన్న లాక్ డౌన్‌ను సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు పొడిగించారు.



ఇక తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.  గచ్చిబౌలిలో 400 పడకలతో ప్రత్యేక ఆసుపత్రి. మూడోదశను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నాహాలు చేస్తోంది. అయితే శ‌నివారం మాత్రం ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పిన‌ట్టే క‌నిపించింది. ఆ ఒక్క రోజే ఏకంగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు నమోదైన తర్వాత గుర్తించిన కేసుల్లో ఇదే అత్యధికం. ఓ వైపు ప్ర‌భుత్వ యంత్రాంగం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. సీఎం కేసీఆర్ ఎన్ని సార్లు ప్రెస్‌మీట్లు పెట్టి ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నా క‌రోనాకు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు.



ఇందుకు ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కొందరు అంతర్జాతీయ ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతంది.  ఈ కఠిన సమయంలో వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతుగా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ ప‌రిస్థితి కూడా అదుపు త‌ప్పితే తెలంగాణ‌లో క‌రోన వైర‌స్ మూడో స్టేజ్‌కు వెళ్లిపోతుంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌స్మాత్ తెలంగాణ ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌..!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: