ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పట్టు బిగుస్తోంది. 184 దేశాలకు వైరస్ విస్తరించింది. ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌ తీవ్రంగా అల్లాడిపోతున్నాయి. అక్కడ నిత్యం వందల మంది చనిపోతున్నారు.  ప్రస్తుతం భారత్ లో సైతం ఈ కోరానా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు.  ఇప్పటికే 20 మరణాలు సంబవించాయి.  ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  నిన్నటి వరకు  కరోనా వైరస్ ప్రభావం తక్కువగా కనిపించిన ఆఫ్రికా ఖండంలోను కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగోలో తొలి మరణం సంభవించింది.

 

అంగోలా, ఎరిత్రియాలో తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.  ప్రస్తుతం 46 దేశాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 3 వేల‌కు చేరుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఆఫ్రికా దేశాల్లో మొత్తం 83 మంది వైర‌స్ బారిన‌ప‌డి చ‌నిపోయారు.  కేసులు ఏమీ లేకున్నా.. సియ‌ర్రా లియోన్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. గునియా, ఎరిత్రియా దేశాలు స‌రిహ‌ద్దుల‌ను మూసివేశాయి.

 

ద‌క్షిణాఫ్రికాలోనూ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది.  లిస‌తో, జింబాబ్వే దేశాలు కూడా లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  కెన్యాలో మాత్రం క‌ర్ఫ్యూ విధించారు. ప‌లు చోట్ల లాఠీచార్జ్ జ‌రిగింది. మార్చి 26వ తేదీన సౌతాఫ్రికా లౌక్‌డౌన్ ప్ర‌క‌టించింది.  వెస్ట్ ఆఫ్రికాకు చెందిన ఐవ‌రీ కోస్ట్‌లో క‌రోనా కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 దాటింది. ఆఫ్రికాలో సుమారు 900 మిలియ‌న్ల మంది వైర‌స్ బారిన‌ప‌డే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 


apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: