క‌రోనా వైర‌స్ ఏపీలో సైతం చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తోంది. ఇక వైర‌స్ పై ప్ర‌తి రోజు స‌మీక్షిస్తోన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని ప్రెస్‌మీట్లు పెడుతూనే ఉన్నారు. శ‌నివారం ప్రెస్‌మీట్లో ఆయ‌న మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన ప్రతి పది మందికి ఒక డాక్టర్ ను నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు.



రైతు బజార్లలో సామాజిక దూరం పాటించాలని కూడా ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో 13 మందికి పాజిటివ్ వచ్చిందని... ఈ 13 కేసుల్లోనూ ఒక కేసు మినహా మిగిలిన 12 కేసులు అర్బన్ ప్రాంతాల్లోనే నమోదు అయ్యాయని... దీనిని బట్టి చూస్తుంటే కరోనా వైరస్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బ‌న్‌ ప్రాంతాల్లోనే వ్యాప్తి చెందుతోన్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన ప్రజలు కరోనా వైరస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



ఇక ఏపీకి కి ఇప్పటికే విదేశాల నుంచి 29 వేలకుపైగా ప్రజలు వీరిని విషయంలో అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ముఖ్యంగా వైజాగ్‌, గుంటూరు తో పాటు ప‌లు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వైర‌స్ ఎక్కువుగా ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. దీనిని బ‌ట్టి ఏపీలో అయినా ఎక్క‌డైనా ప‌ట్ట‌ణ ప్రాంతాల ప్ర‌జ‌లే ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన విష‌యం అర్థ‌మ‌వుతోంది.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: