క‌రోనా వైర‌స్(కోవిడ్‌-19) ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్ప‌టికే కరోనా వైరస్ కేసుల సంఖ్య 465,000 దాటింది. మరణాల సంఖ్య కూడా 21 వేల దాటింది.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇటలీలో వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో ఈ వైరస్ 86,498 మందికి సోకగా.. అందులో 10,950 మంది కోలుకున్నారు. ఇక ఈ వ్యాధి బారిన పడి ఏకంగా 9,134 మంది మృత్యువాతపడ్డారు. కరోనా పుట్టిల్లు చైనాలో కన్నా ఇటలీలొనే ఎక్కువమంది ఈ వైరస్ కు బలయ్యారంటేనే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

ఆరంభంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందో మిగతా దేశాలకు ఇటలీ పరిస్థితి గుణపాఠం నేర్పుతుంది. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న ఇటలీలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. తాజాగా ఇటలీలో 101 ఏళ్ల వయోవృద్ధుడు కరోనాను జయించి ఆ దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికి ఆశాదీపంగా మారారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 101 ఏళ్ల ‘మిస్టర్‌పి’ అనే వ్యక్తికి వైరస్‌ సోకడంతో గతవారం ఆస్పత్రిలో చేరాడు. 
1919లో జన్మించిన ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా వైర‌స్‌ బారిన పడినప్పటికీ.. ఆ వ‌య‌స్సులో కోలుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

 

ఇక తాజాగా ఆయన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. కాగా, కరోనా వైరస్‌ విజృంభణ గురించి గత కొన్ని వారాలుగా విషాద గాధలు వింటున్నాం. ముఖ్యంగా వృద్ధులపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే 101 ఏళ్లు వయోవృద్ధుడు కరోనా సోకినప్పటికీ  కోలుకున్నారు. దీంతో భరోసా కోసం ఎదురు చూస్తున్న టైమ్‌లో ఈ పరిణామం అక్క‌డ వాళ్ల‌కు బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే కరోనా మృతుల్లో ఎక్కువగా వయోవృద్ధులే ఉన్నారు. కానీ, వందేళ్లు పైబడిన వారు కూడా కరోనాను తట్టుకుని నిలబడగలరన్న నమ్మకాన్ని మిస్టర్ పి కలిగించారు.
 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: