కరోనా వైరస్ ప్రపంచం పై కొరడా ఝళిపిస్తున్న వేళ WHO తగినన్ని సూచనలు చేస్తోంది. ఇక కేంద్ర, రాష్ట్ర నాయకులు దాన్ని అరికట్టడానికి తగినన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ, కరోనా వైరస్ బాధితుల శాతం పెరుగుతూనే ఉండటం బాధాకరం. వివిధ ప్రింట్, సోషల్ మీడియాలు కూడా కరోనా వారి బాధ్యతగా... రక రకాల విధి విధానాలలో, ప్రజలలో అవగాహన కలిగిస్తున్నారు.

 

ఇక ప్రస్తుత బాధితుల సంఖ్యను గాని ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రపంచ వ్యాప్తంగా 613,882 కు పైగా వుంది. అందులో 28,231 మంది మరణించగా.. 137,247 మంది కోలుకున్నట్లు సమాచారం. ఇక మన  దేశంలో కరోనా వైరస్ కేసులు... 933 నమోదు కాగా... కొత్త కేసులు 46 నమోదు అయినట్లు తాజాగా వెల్లడైంది. మనదగ్గర 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మిగిలినవారు కోలుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

ఇక ఏపీ అండ్ తెలంగాణ పరిస్థితి అందరికి తెలిసినదే. ప్రస్తుతానికి పెద్ద మార్పులేవీ కనబడక పోయినా... మెల్లి మెల్లిగా, రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరగడం ఒకింత కలవరమే. ఇరు రాష్ట్రాల్లో దాదాపు 72 కేసులు నమోదు కాగా.. తెలంగాణా లో 59 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 13 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు కరోనా బాధితులందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. కరోనా కట్టడి కోసం ఇరు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు.. న భూతొ న భవిష్యతి.... అతి త్వరలోనే కరోనా మహమ్మారి మన రాష్ట్రం.. దేశం.. ఏకంగా ప్రపంచము నుండి పారిపోవాలని అందరూ దేవుణ్ణి స్మరిస్తున్నారు....

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: