ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి 27,000 మందికి పైగా మృతి చెందారు. యూకేలో ఇప్పటివరకూ 11,658 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 578 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. 135 మంది కరోనా నుండి కోలుకున్నారు. యూకే వైద్య అధికారుల లెక్కల ప్రకారం 163 మంది రోగుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. బ్రిటన్ ప్రధానికే కరోనా సోకడంతో కరోనా సోకుతుందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
 
యూకేలో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం 12,000 మృతదేహాలను భద్రపరిచే విధంగా ప్రముఖ అంతర్జాతీయ విమానశ్రయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో తాత్కాలిక మార్చురీ నిర్మాణం జరుగుతోంది. అధికారులు రానున్న రోజుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చురీ నిర్మాణం చేపడుతున్నారు. 
 
ఈ విషయాన్ని ఎన్.ఎచ్.ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైమన్ టీవ్స్ నిర్ధారించారు. ప్రస్తుతం మార్చురీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 1500 మంది మృతదేహాలను భద్రపరిచేందుకు అవకాశం ఉండగా దాదాపు 8 రెట్లు మార్చురీ సామర్థ్యం పెంచే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మార్చురీని ఇతర కారణాలతో చనిపోయిన వారి కోసం కూడా ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. 
 
ప్రభుత్వం మిలటరీ సహాయసహకారాలతో మార్చురీ నిర్మాణం చేపడుతోంది. మిలటరీ హెలికాఫ్టర్ల సహకారంతో కరోనా రోగులను తరలిస్తోంది. 14 లక్షల మంది ప్రజలు బ్రిటన్ లో హోం క్వారంటైన్ లో ఉన్నారు. లక్షల సంఖ్యలో వాలంటీర్లు రంగంలోకి దిగి ఆహారం, మందుల సరఫరాతో పాటు ఇతర పనుల్లో సహాయసహకారాలు అందిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: