ప్రపంచం స్తంభించిపోతోంది. నిన్నమొన్నటివరకూ నిత్యం జనంతో నిండివున్న నగరాలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో స్మశాన నిశబ్దం అలముకుంటోంది. ప్రపంచంలో పలు చోట్ల లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. చైనాలో మొదలైన మరణాల సంఖ్య అక్కడ తగ్గినా ఇతర దేశాల్లో ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ లాంటి దేశాల్లో మరణాలు తీవ్రం అవుతున్నాయి. దాంతొో చనిపోయిన వారిని ఖనం చేసే పరిస్థితి చేయిదాటి పోతుంది. 

 

జనజీవనం ఇళ్లకే పరిమితమైంది. స్కూళ్లు, కాలేజీలు లేవు. ఊళ్లకు ప్రయాణాలు లేవు. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు మూతబడ్డాయి...ఆఫీసు పనులు ఇళ్లలోంచే చేస్తున్నారు.  శనివారం వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా 597267 లక్షల మందికి సోకింది. ఇందులో 27365 మంది మరణించారు. ఇందులో అత్యధికులు యూరప్ దేశలకు చెందిన వారే కావడం అక్కడ మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది.    ప్రఖ్యాత బర్మిగ్ హమ్ సిటీలోని బర్మింగ్ హమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కొవిడ్-19 మార్చురీగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.  ఎయిర్ పోర్టులోని కార్గొ టెర్మినల్ దగ్గరున్న భవన సముదాయాలను మార్చురీగా మార్చే ప్రక్రియ శుక్రవారమే మొదలైనట్లు శాండ్వెల్ మెట్రోపాలిటన్ కౌన్సిల్ లీడర్ వసీమ్ అలీ మీడియాకు చెప్పారు.

 

బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోన్న మార్చురీలో కనీసం 1500 మృతదేహాలను భద్రపర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మృతుల కుటుంబీకుల మనోభావాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా, శవాలను పకడ్బందీగా భద్రపరుస్తామని వెస్ట్ మిడ్ లాండ్ పోలీసులు భరోసా ఇస్తున్నారు.  ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న మరణాలు.. కరోనా వైరస్ భారిన పడ్డ రోగులను ఎక్కడ ఉంచాలో అన్న ఇబ్బందుల్లో ఆయా దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వివిధ పద్దతులు ఆలోచిస్తున్నారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: