ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మాద్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు.. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు .. అందుకే లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది.. ఈ విధానంలో భాగంగా పేదల పరిస్తితి మరీ దారుణంగా మారింది.. 

 

 

 

పేదలను ఆదుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు సూచిస్తున్నారు..ఇప్పటికే చాలా మంది తెలుగు రాష్ట్రాల కోసం విరాళాలను సేకరిస్తున్నారు..ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనా ప్రభావం మరింత ముదిరింది.

 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 27,250 మంది కరోనా వల్ల మృతి చెందారు. 5.94 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు1.33 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 9,134, స్పెయిన్‌లో 5,138 కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 1,477 మంది ప్రాణాలు కోల్పోయారు.దినం మారే కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు.. 

 

 

 

 

ఇక జర్మనీలో 50,871 మందికి కరోనా సోకగా, 351 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 32,964 మందికి కరోనా సోకింది. వారిలో 1,995 మంది మృతి చెందారు. ఇరాన్‌లో 32,332 కరోనా కేసులు నమోదుకాగా మృతుల సంఖ్య 2,378గా ఉంది. యూకేలో 14,543 మంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో 759 మంది మృతి చెందారు. స్విట్జర్లాండ్‌లో 12,928 మందికి కరోనా సోకగా, 231 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. అందుకే ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వాల చేతులలో కూడా లేదని అర్థమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: