క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19) మహమ్మారి రోజురోజుకూ బలపడుతూ వేలమందిని పొట్టనపెట్టుకుంటోంది.  ప్రపంచాన్ని కమ్మేస్తున్న కరోనా ర‌క్క‌సి విషయంలో ఉదాసీనంగా ఉంటే మ‌న ప్రాణాలు గాల్లో దీపం పెట్టిన‌ట్టే ఉంటుంది. కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల పిట్టల్లా రాలిపోతున్నారు. భారత్ లో సైతం కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపించడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రాణం నష్టం జరగగా... లక్షల్లో కరోనా బారినపడ్డారు. అయితే, కరోనాకు ఇదిగో మందు.. ఇలా చేయండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు లేకపోలేదు. 

 

అయితే, ఇప్పటి వరకు శాస్త్రీయంగా కరోనాకు మందును మాత్రం కనిపెట్టింది లేదు. కానీ, సోష‌ల్ మీడియా వేధిక కొన్ని వదంతుల వ‌ల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా కూడా ఇరాన్‌లో అదే జ‌రిగింది. కరోనా వైరస్‌ నుండి తమను తాము రక్షించుకునేందుకు ఇండిస్టియల్‌ ఆల్కహాల్‌ (మిథనాల్‌)ను సేవించి 300 మంది ఇరానియన్లు మృతిచెందారు. మరో వెయ్యిమందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఇరాన్‌ వార్తా సంస్థ ఇర్నా వెల్ల‌డించింది.

 

కరోనావైరస్‌ ఇరాన్‌ను కుదిపేస్తోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో మృతి చెందారు, చెందుతున్నారు కూడా. ఈ కొత్తరకం వైరస్‌కు విరుగుడు కనుక్కోవడానికి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మిథనాల్‌తో కరోనా వైరస్‌ను  ఓడించవచ్చంటూ ఇరాన్ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ తప్పుడు కథనాలను నిజమేననుకుని మిథనాల్‌ పెద్దయెత్తున సేవించడంతో వారి ప్రాణాలకే ముప్పు వచ్చింది. 

 

ఈ క్ర‌మంలోనే మిథనాల్ తాగిన 300 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 1100 మంది వరకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. నిజానికి మెథనాల్‌ను వాసన చూడటం, తాగడం చేయరాదని ఇది శరీర భాగాలపై దుష్ర్పభావం చూపడమే కాకుండా మెదడును ధ్వంసం చేస్తుందని, వ్యక్తులు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: