కరోనా వైరస్ భారత్ లో మూడో దశకు చేరుకుందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. కరోనా వైరస్ మన దేశంలో ఇప్పుడు విలయతాండవం దశలో ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. కరోనా వైరస్ కి మూడు దశలు ఉంటాయి. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం కరోనా సోకడం అనేది మొదటి దశగా చెప్పుకోవచ్చు. రెండవ దశ విషయాన్న్కి వస్తే... రెండో దశ ఏంటీ అంటే... విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా స్థానికులైన కుటుంబ సభ్యులు లేదా వారు కలిసినవాళ్లకు వ్యాధి సోకడం. 

 

కమ్యూనిటీలో వైరస్ విస్తరించడం... ఈ దశలో వైరస్ ప్రత్యేకించి ఎవరి ద్వారా వ్యాప్తి చెందిందని చెప్పాడ౦ గానీ కనీస అవగాహనకు రావడం గాని ఎక్కడా ఉండదు. ఎంతమందికి వ్యాప్తి చెందిందన్నది కూడా కనీస అంచనాకు రాలేము. మన దేశంలో ఇప్పుడు కరోన వైరస్ రెండో దశలో ఉందని అంటున్నారు. కాని అది మన దేశంలో మూడో దశలో ఉందని అంటున్నారు కోవిడ్-19 ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ. ఆయన ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. జాతీయ మీడియా ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

అధికారికంగా మనం దీన్ని మూడో దశ అని చెప్పకపోయినా ఇది మూడో దశనే అని గిరిధర్ గ్యానీ ఈ సందర్భంగా అభిప్రాయపడటం ఆందోళన కలిగిస్తుంది. రాబోయే 5 నుంచి 10 రోజులు కరోనాను నియంత్రించేందుకు చాలా కీలకమని అయన అభిప్రాయపడ్డారు. ఈ పీరియడ్‌లో ఇప్పటివరకు లక్షణాలు బయటపడని చాలామందిలో లక్షణాలు బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే కొద్దివారాల్లో వైరస్ ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించిన ఆమె తగినన్ని కరోనా వైరస్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు సమయం కూడా లేదని ఆందోళనకార విషయం చెప్పారు. ఆసుపత్రుల కోసం తగిన శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేరని చెప్పడం ఇప్పుడు భయపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: