ప్రపంచం మొత్తాన్ని ఆందోళనలోకి నెట్టిన కరోనా వైరస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని..ఏడేళ్ళ క్రితమే అంటే 2013 లోనే ఈ కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందని తెలుస్తోంది. తాజాగా 2013 లో ఓ తెలుగు పత్రికలో కరోనా గురించి వచ్చిన ఓ కధనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “కరోనా కలవరం ఆరుకు చేరిన మృతుల సంఖ్య” అనే హెడ్డింగ్ తో వచ్చిన ఈ కధనం చదివిన ప్రతీ ఒక్కరూ అప్పట్లోనే కరోనా వైరస్ ఉందని తెలిసి ఇప్పటి వరకూ వైరస్ కి మందు కనిపెట్టక పోవడంలో ఆంతర్యం ఏమిటి ఇది నిర్లక్ష్యానికి నిలువుటద్దం కాదా అంటూ మండిపడుతున్నారు...

ఈ వార్త సారంశం ఏమిటంటే...

సార్స్  తరహా  లక్షణాలతో ప్రపంచంలోకి కొత్త వైరస్ వచ్చిందని, దీని పేరు “నోవెల్ కరోనా వైరస్ గా పేరు పెట్టారని ఈ వైరస్ ధాటికి ఒకరు మృతి చెందారని, అదే తరహా మృతి బర్మింగ్హామ్ లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో కూడా జరిగిందని పేర్కొన్నారు. గత ఏడాదే మధ్య తూర్పు ప్రాంతంలో ఈ కొత్తరకం వైరస్ బారినపడి సుమారు ఆరుగురు మృతి చెందారని ఈ కథనంలో తెలిపారు. ఈ వైరస్ వలన సాధారణ జలుబు, సార్స్, తీవ్రస్థాయి శ్వాసకోస వంటి లక్షణాలు కనిపిస్తాయని ,ఈ వైరస్ ఊపిరితిత్తుల మార్గాల పొలంలోకి వెళ్లి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తోందని ,ఇది మానవ కణాల్లో ఊహించని స్థాయిలో పెరుగుతోందని స్విట్జర్లాండ్లోని కాంటోనల్  ఆసుపత్రి పరిశోధకులు వోల్కేర్ దీల్ పేర్కొన్నట్టుగా ప్రచురించబడింది.

IHG

అయితే 2013 లోనే ఈ వైరస్ 2012 లో ప్రభావం చూపినట్టుగా ఉన్నా అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎందుకు ఈ వైరస్ విరుగుడికి మంది కనుగొనలేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ వైరస్ కి గబ్బిలంలోని కరోనా వైరస్ తో సారూప్యత ఉందని బ్రిటన్ ఆరోగ్య రక్షణ ఏజెన్సీ పేర్కొన్నట్టుగా ఈ వ్యాసంలో ఉంది. ఈ వైరస్ కి మందు అప్పుడే కనుగొని ఉండిఉంటే ఇప్పుడు వేలాది మంది మరణించి ఉండేవారు కాదని , లక్షలాది కేసులు నమోదయ్యేవి కావని వాపోతున్నారు. ఏది ఏమైనా జరగాల్సిన వినాశం జరుగుతోంది కాబట్టి ఇప్పటికైనా మందు కనిపెడుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: