కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయం లో కేరళ ప్రభుత్వం చేతులెత్తేసిందా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. కేరళలో దాదాపు 200 కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మరణాలు తక్కువగానే ఉన్నా కేరళలో విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అక్కడి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే వైరస్ వ్యాప్తి మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కేరళలో కరోనా వైరస్ కారణంగా కొచ్చీ లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

 

దీనితో కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కేరళ ప్రభుత్వం దాదాపుగా విఫలమైంది అనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. వాస్తవానికి త్రివేండ్రం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయాలను ముందే నిలిపివేయాల్సి ఉంది. కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించినందున కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించింది అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. పినరయి విజయన్ సర్కార్  కరోనా వైరస్ ని కట్టడి చేయాలి. 

 

అంటే ఇప్పుడు ఎవరికి వారికి ఇంటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న లాభం లేదని ప్రజలు ఎవరైనా బయటకు వస్తే కాల్చివేయాలి అనే ఉత్తర్వులను జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. విపక్షం కూడా దీనికి సమర్ధిస్తున్నారు అని అంటున్నారు. అక్కడ విపక్ష నేతలు కూడా కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు మినహా మరో మార్గం లేదు అనే సూచనను కూడా ప్రభుత్వానికి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ విధంగా సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి  కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు ఇళ్ళకు సరుకులను పంపించి ఎవరిని బయటకు రానీయకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: