ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 6 లక్షల మందికి పైనే ప్రజలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వేలల్లో మృత్యువాత పడ్డారు. ఇక ఈ కరోనా వైరస్ ఇండియాలో కూడా ఎక్కువగానే ప్రభావం చూపుతోంది. అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు దేశం 21 రోజుల పటు లాక్ డౌన్ లోకి వెళ్ళింది. ఇటు ఈ లాక్ డౌన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత కఠినంగా అమలు అవుతుంది.

 

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా తక్కువగానే ఉన్నా, జగన్ ప్రభుత్వం చాలాకఠినమైన చర్యలు తీసుకుంటూ,కరోనా వ్యాప్తి పెరగకుండా చూసుకుంటుంది. కాకపోతే ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కొంత సమయం కేటాయించారు. ప్రజలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు బయటకు వచ్చే విధంగా అవకాశం కల్పించారు. కానీ ప్రజలు ఈ రూల్ ని దుర్వినియోగం చేస్తున్నారు.

 

ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా రోడ్ల మీదకొచ్చేస్తున్నారు. చాలాచోట్ల సామాజిక దూరాన్ని పాటించడం లేదు. కూరగాయల మార్కెట్లలో గుంపుగుంపులుగా తిరిగేస్తున్నారు. పోనీ పోలీసులు ఏమైనా చేద్దామంటే ప్రభుత్వమే సమయం ఇచ్చింది కదా,ఈ సమయంలో కూడా మమ్మల్ని వస్తువులు తెచ్చుకోనివ్వరా అంటూ, తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అయితే లాక్ డౌన్ ఉన్నప్పుడు ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరముంది.
 

కానీ ఒక ఇంటి నుండే ఇద్దరు,ముగ్గురు బయటకొచ్చేయడం, లేదా అవసరానికి మించి పదే పదే రోడ్ల పైకి రావడం, వచ్చినా పెద్దగాసామాజిక దూరం పాటించకపోవడం చేస్తున్నారు. ఫలితంగా ఇలా ప్రజలు క్రమశిక్షణ లేకుండా ఉండటం వాళ్ళ కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది. దీంతో జగన్ ప్రభుత్వం జనాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సమయాన్ని తగ్గించే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉన్న సమయాన్ని, తగ్గించి ఉదయం 6 నుంచి ఉదయం 9.30 గంటల వరకు మాత్రమే ప్రజలకు  నిత్యావసర వస్తువులని తెచ్చుకునే అనుమతి కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: