తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరింది. మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకినట్లు చెప్పారు. పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకిందని అన్నారు. రాష్ట్రంలోని 65 మంది కరోనా బాధితుల్లో ఒకరు డిశ్చార్జ్ కాగా ఒకరు మృతి చెందారని తెలిపారు. 
 
 
ఈరోజు నమోదైన ఆరు పాజిటివ్ కేసులకు ట్రావెల్ హిస్టరీ ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే చెప్పాలని ఆదేశాలు జారీ చేశామని అలా ఈరోజు కరోనా సోకిన వ్యక్తి చనిపోయినట్లు తెలిసిందని అన్నారు. ఖైరతాబాద్ లో కరోనా లక్షణాలతో బాధ పడుతున్న 74 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని.. అధికారులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచారని చెప్పారు. 
 
ఆ వ్యక్తి ఈ నెల 14న ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారని రాష్ట్రానికి ఈ నెల 17న తిరిగి వచ్చారని చెప్పారు. గత వారం రోజుల నుంచి జ్వరం, శ్వాస సమస్యలు రావడంతో సైఫాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారని అన్నారు. నిన్న రాత్రి వృద్ధుడు చనిపోగా సైఫాబాద్ పోలీసులు శవాన్ని మార్చురీకి తరలించి పరీక్షలు చేయడంతో కరోనా సోకినట్లు తెలిసింది. 
 
మంత్రి ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా ఖైరతాబాద్ ప్రాంతంలో ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలతో కనిపిస్తే వారికి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షల ఫలితాలు వస్తే మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: