మనుషులు పగబడతారని తెలుసు. కుక్కలు కూడా పగబడతాని అంటారు. కానీ కంటికి కనబడది కొరోనా వైరస్ కూడా పగబడుతుందా ? ఇపుడిదే విచిత్రంగా ఉంది. చూడబోతే కరొనా వైరస్ ఇటలీ మీద పగబట్టినట్లే అందరికీ అనుమానంగా ఉంది. లేకపోతే యూరప్ ఖండంలో బాగా డెవలప్ అయిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి దేశాన్ని వైరస్ మహమ్మారి పగబట్టినట్లుగా వణికించేస్తోంది. ఇప్పటికి సుమారు 90 వేల మంది కొరోనా వైరస్ దెబ్బకు మంచాలకి అతుక్కుపోగా మరో 9400 మంది చనిపోయారు.

 

ఇటలీలో ఇన్ని వేలమంది బాధితులుండటం ఏమిటి ? ఇన్ని వేలమంది చనిపోవటం ఏమిటనే యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఎంతమంది ఆశ్చర్యపోయినా, నమ్మకలేకపోతున్నా వాస్తవం వాస్తవమే కదా. ఉత్తర ఇటలీలో టెక్స్ టైల్ కంపెనీలు చాలా ఎక్కువట. అందులో చైనా వాళ్ళు ఎక్కువమంది పనిచేస్తున్నారట. వాళ్ళ ద్వారా వైరస్ ఇటలీలోకి ప్రవేశించింది. దానికి తోడు వైరస్ సోకిందన్న అనుమానంతో తమను ఇటలీ వాళ్ళు దూరంగా పెడుతున్నారంటూ  చైనా వాళ్ళు చిన్నబుచ్చుకున్నారు.

 

ఎప్పుడైతే చైనా వాళ్ళు రోడ్లపై తమ నిరసనను తెలియజేయటం మొదలుపెట్టారు. వెంటనే  తమ విశాల హ్రుదయాన్ని చాటుకోవటానికా అన్నట్లుగా ఇటలీ జనాలు చైనా వాళ్ళందరినీ కావలించుకోవటమే కాకుండా  ముద్దులు కూడా  పెట్టుకున్నారు. ఇక చెప్పేదేముంది జనాలపై  వైరస్ దండయాత్ర మొదలుపెట్టింది.  దాంతో ఇటలీ జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. దానికితోడు ఆ దేశంలో వయస్సయిపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. దాంతో వైరస్ దెబ్బకు వృద్ధుల్లో చాలామంది బలైపోయారు.

 

దేశం మొత్తం మీద  లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తున్నప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వైరస్ విషయంలో మేల్కోవాల్సొన సమయంలో ప్రభుత్వం, ప్రజలు చాలా నిర్లక్ష్యం చూపించారు.  దాని ఫలితమే ఇపుడు అనుభవిస్తున్నారు. ఇపుడు చనిపోతున్న వాళ్ళంతా వైరస్ బాగా ముదిరిపోయిన వాళ్ళే కావటం గమనార్హం. లాక్ డౌన్ వల్ల ఇపుడు కాస్త ఉపయోగం కనబడుతోంది లేండి. ఏదేమైనా ఇటలీ మీద కొరోనా వైరస్ పగబట్టిందా అనే అనుమానం వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: