పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి పోరాటం చేస్తోంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అంశం ఒక్కటే కరోనా వైరస్ కి అసలు మందు ఉందా లేదా. మందు ఉంటే ఎక్కడ ఉంది ఏ దేశాలు దీన్ని కనిపెట్టారు అనే దానిపై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు సామాజిక దూరమే మార్గం. మరొకటి లేదని ప్రపంచదేశాలన్నీ చెబుతున్నాయి. 

 

అయితే చైనా, దక్షిణ కొరియా, రష్యా దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ కి ముందు కనిపెట్టాయని,  ఆయా దేశాలు మాత్రమే దాన్ని వాడుకుని ప్రపంచదేశాలకు ఇవ్వడం లేదు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటలీ సహా స్పెయిన్ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ దాడి కి అల్లాడిపోతున్నాయి. ఆ దేశాలు రెండూ కూడా మందు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటలీ లో దాదాపు పది వేల మంది చనిపోగా స్పెయిన్ లో కరోనా వైరస్ తీవ్రత కు ఐదు వేల మంది వరకు చనిపోయారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా వైరస్ కోరల్లో పూర్తిగా చిక్కుకుంది అని చెప్పాలి.

 

 ఆ దేశం కూడా శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిన కరోనా వైరస్ కి మందులు లేక ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా అదుపులోకి  రావడం లేదు. దీంతో మందు తప్ప ఇప్పుడు మరో మార్గం లేదు అనే అభిప్రాయం అన్ని దేశాల్లో నూ వ్యక్తమవుతోంది. అయితే చైనా మాత్రం కొన్ని దేశాలను  ఆర్థికంగా దెబ్బతీయడానికి కరోనా మహమ్మారికి తాను తయారు చేసిన ముందు ని బయట పెట్టడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువ గా వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: