తెలుగు రాష్ట్రాలకు కరోనా భయం కమ్మేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందులోనూ ఈ పెరిగే కరోనా కేసులన్నీ పట్టణాలు, నగరాల్లోనే నమోదవుతుండటం విశేషం. దీన్ని బట్టి చూస్తే కరోనా నుంచి కాపాడుకోవాలంటే.. పట్టణాలు, నగరాల కంటే పల్లెలే నయం అన్న వాదన వినిపిస్తోంది. ఏపీ మంత్రి ఆళ్ల నాని మాటలు చూస్తే ఈ మాట నిజం అనిపించకమానదు.

 

 

ఎందుకంటే ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులన్నీ అర్బన్‌ ప్రాంతాల్లోనే నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని వివరించారు. ఇప్పటి వరకు నమోదైన 13 పాజిటివ్‌ కేసుల్లో 12 కేసులు అర్బన్ ప్రాంతానివే. విదేశాల నుంచి వచ్చే వారు ఎక్కువగా నగరాలు, అర్భన్ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. అందుకే కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించారు.

 

 

ఇప్పటి వరకూ ఏపీలో 13 కేసులు నమోదు అయ్యాయి. అందులోని 12 పాజిటివ్‌ కేసులు అర్బన్‌ ప్రాంతాల్లో నమోదైనవే కావడం విశేషం. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ కూడా చెప్పారు. పట్టణాలు, నగరాల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించాలని సూచించారు. ప్రతి 10 మందికి ఒక వైద్యుడి, నిపుణుడిని కేటాయించాలని నిర్ణయించారు.

 

 

అయితే ఇప్పటికే పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఎవరు ప్రయాణాలు చేసే అవకాశం లేదు. అందుకే నగరవాసులు ఇల్లు కదలకుండా ఉంటే కరోనా నుంచి కాపాడుకోవచ్చు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: