ఏపీలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు.  కరోనా ని సాద్యమైనంత వరకు కట్టడి చేయడం మన బాధ్యత.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ  తన వంతు బాధ్యత వహించాలని కోరారు.  ఇక లాక్ డౌన్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కష్టకాలం వచ్చింది.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  అయితే, ఈ సమయాన్ని తగ్గించాలని కొందరు మంత్రులు సీఎం జగన్ కు తెలుపగా, ఆయన దీనిపై స్పందించారు.  

 


ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు, మొబైల్ నిత్యావసరాల దుకాణాలను తీసుకెళ్లగలం అన్న ధీమా ఉన్నప్పుడే సమయం తగ్గించే ఆలోచన చేద్దామని సీఎం స్పష్టం చేశారు.ఈ క్రమంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు మూడు సార్లు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా ఆదివారం నాడు బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయనున్నారు. ఆపై ఏప్రిల్ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తారు. ఏప్రిల్ 29న మూడో విడతగా బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తారు.

 


 క్యాబినెట్ సమావేశం అనంతరం ఏపీ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఏపీ విద్యార్థులు, ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తామని, తమతో సహకరించాలని పేర్కొన్నారు.   ఏప్రిల్ 29న మూడో విడతగా బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తారు. అంతేగాకుండా, ఏప్రిల్ 1నే రాష్ట్రంలో పింఛన్లు ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఏప్రిల్ 4న పేదలకు రూ.1000 చొప్పున ఇస్తామని తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.. కష్టాలు ఎప్పుడు ఉండవని ఈ సమయంలో అంతరం సంయమనం పాటించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: