ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి అల్లల్లాడిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆరు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇంతమంది ప్రజలు కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటి వరకు కరోనా భారిన పడి 27 వేల మందికి పైగా భాదితులు తమ ప్రాణాలను వదిలారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు వేగంగా నమోదు అవ్వటంతో లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా 21 రోజులు లాక్ డౌన్ పాటించింది. అయినా కేసులు విస్తరించటంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

 

ఈ సందర్భంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు ఓ శుభవార్త అందించారు. ఇది విన్న ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాస్త నెమ్మది పడుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. 10 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణాలో మొత్తం 65 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ మొత్తంలోనే ఖైరతాబాద్‌ కు చెందిన 74 ఏళ్ళ ఓ వృద్ధుడు చనిపోయారు. మరో వ్యక్తి ఇప్పటికే ట్రీట్ మెంట్ తీసుకుని కవర్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఇక ఈ ఇద్దరినీ మినహాయిస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య 63 కి చేరింది. ఇక ఈ 63 మందిలో 10 మందికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బాధితుల సంఖ్య 53కు తగ్గనుంది.

 

అయితే.. వారికి మరల పరీక్షలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించిన అనంతరం పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని ఇళ్లకు పంపుతామని వైద్యులు, అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈరోజు తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. అయితే.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఖైరతాబాద్ కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు చనిపోయాడు. అయన మరణంపై అనుమానంతో ఆ వృద్ధుని బ్లడ్ శాంపిల్స్ పరీక్షలకు పంపగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: