ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.  ఈ కరోనా దెబ్బకు యావత్ భారత దేశం లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు.   సాధారణంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచంలోని పలు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కొంద‌రు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కొంద‌రైతే ఒక‌సారి వైర‌స్ బారిన‌ప‌డి బ‌తుకుజీవుడా అంటూ బ‌య‌ట‌ప‌డి కూడా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

 

తాజాగా ఓ వ్యక్తికి కరోనా వచ్చి తగ్గింది.. కానీ అతడు చేసుకున్న స్వయంకృపరాదంతో మళ్లీ తగిలించుకున్నాడు.  పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన ఒక వ్యక్తికి రెండు వారాల క్రితం కరోనా సోకింది. వైద్యులు అతన్ని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించారు. రెండు వారాలు ముగియ‌డంతో ఇటీవ‌ల మ‌రోసారి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగెటివ్‌గా తేల‌డంతో అతడిని ఇంటికి పంపించారు.  కానీ అతడు మాత్రం తనకు తగ్గిందన్న మహాసంతోషంతో వంద మందిని పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు.. అందులో ఓ వ్యక్తికి కరోనా ఉండటంతో మళ్లీ ఆ వ్యక్తికి రెండోసారి కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో ఆ ఇద్ద‌రిని క్వారెంటైన్ సెంట‌ర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: