దేశంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండగా... విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో వారు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ప్రభావంతో మొబైల్, ల్యాప్ టాప్ లు వినియోగించే వారి సంఖ్య పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు 60 శాతం ఎక్కువగా టెలీకాం కంపెనీలు చెబుతున్నాయి. 
 
పలు టెలికాం కంపెనీలు ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సాధారణ రోజులో రోజుకు 4 గంటలు ఇంటర్నెట్ వినియోగించేవారని ఇప్పుడు ఆ వినియోగం ఏకంగా 10 నుంచి 12 గంటలకు పెరిగిందని చెబుతున్నారు. వీడియో స్ట్రీమింగ్ వల్ల ఎక్కువ స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని... అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలను వీడియో నాణ్యత తగ్గించాలని కోరారు. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 65కు చేరింది. ఈరోజు మరో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈరోజు తెలంగాణలో తొలి మరణం నమోదైంది. కరోనా లక్షణాలతో ఖైరతాబాద్ లో 74 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు. 
 
రెండు తెలుగు రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఏపీలో కర్నూలు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రాజస్తాన్ కు చెందిన యువకుడు సంజామల మండలంలోని నొస్సంలో గత కొంతకాలంగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రికి తరలించి నమూనాలను పరిశీలించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 14కు చేరింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: