దేశం లో  లో కరోనా వ్యాధి ప్రబలుతున్న సమయం లో ఆంధ్ర ప్రదేశ్ కు విదేశాల నుంచి వచ్చిన వారిని అధికారులు  క్వారంటైన్ కు పంపారు . కానీ వారిలో కొందరు క్వారంటైన్ నుంచి తప్పించుకుని,  ప్రజల్లో కలిసిపోయి తిరుగుతున్నారు . ఈ నెల 16 వతేదీన అమెరికా నుంచి  విజయవాడ కు వచ్చిన   ఒక యువకుడ్ని , అధికారులు హోమ్ క్వారంటైన్ కు ఆదేశించారు . ఈ మేరకు అతడి  చేతిపై స్టాంపింగ్ కూడా చేశారు . అయితే సదరు యువకుడు మాత్రం అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి ,  బంధువులకు ఇళ్లకు వెళ్ళాడు . అతడు ఎక్కడకు వెళ్ళాడు , ఎవర్ని కలిశాడన్న దానిపై అధికారులు వాలంటీర్లు , ఆశావర్కర్ల ద్వారా వివరాలు  సేకరించే ప్రయత్నం చేస్తున్నారు .  

 

  గుంటూరు లోని జీజీహెచ్ కరోనా క్వారంటైన్  నుంచి ఒక యువకుడు పారిపోయిన విషయం తెల్సిందే . అతను కేసు షీట్ తీసుకుని పారిపోయినట్లు  అధికారులు గుర్తించారు . మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రి లో నర్స్ గా పని చేస్తోన్న ఓ మహిళ భర్త ఇటీవల కువైట్ నుంచి తూర్పు గోదావరి జిల్లా  రాజోలుకు వచ్చాడు . అతన్ని హోమ్ క్వారంటైన్ కు అధికారులు ఆదేశించారు . అయితే అతడు హోమ్ క్వారంటైన్ నుంచి తప్పించుకుని జనావాసాల్లో తిరుగుతున్నట్లు గుర్తించిన గ్రామ  వాలంటీర్లు , పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీనితో పోలీసులు , నర్సు పై కేసు నమోదు చేసి ఆమె భర్త కోసం గాలిస్తున్నారు .

 

భర్త తప్పించుకున్న వివరాలను దాచిపెట్టినందుకు  నర్సుపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు . అదే సమయం లో నర్సుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల కు సిఫార్సు చేశారు . విదేశాల నుంచి వచ్చిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ , జనావాసాల్లో తిరగడం వల్లే రోజు, రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: