భారత్ లో కరోనా ప్రభావం తీవ్రం కానుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. దీనిని భారత్ లో నియంత్రించేందుకు మన ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కానీ.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టం కానుందని తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లో భారత్ లో కరోనా ప్రభావం 3వ స్టేజ్ కు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని డాక్టర్ గిరిధర్ గ్యానీ అంటున్నారు. కోవిడ్ 19 నియంత్రించేందుకు, ఆసుపత్రులపై నీతి అయోగ్ ఏర్పాటు చేసిన ఓ టాస్క్ ఫోర్స్ కు గిరిధర్ కన్వీనర్ గా ఉన్నారు.

 

 

దేశంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. ప్రస్తుతం కరోనా స్టేజి 3లో లేకపోయినా.. ఇది ఆరంభ దశ అనే చెప్పాలని డాక్టర్ గ్యానీ తన మాటల్లో ఉద్ఘాటించారు. ‘రాబోయే వారం రోజులు మరింత కీలకం కానుంది. ఈ దశలో భారత్ లో కరోనా మరింత వ్యప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ 19 కు సంబంధించి మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం. అయినా కానీ ఇప్పటికీ కావలసినంత సంఖ్యలో శిక్షణ పొందిన డాక్టర్లు మనకు అందుబాటులో లేరు’. 

 

 

'కరోనా 3వ దశలో వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ దశ అత్యంత క్లిష్టమైన దశగా భావించాలి. దీన్ని నియంత్రించడం కొద్దిగా కష్టమే. ఇప్పటి వరకూ ఈ వ్యాధి అంటని వారిపై ఈదశలో ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కవ. కాబట్టి రాబోయే వారం-పది రోజులు చాలా కీలక'మని డాక్టర్ గ్యానీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. . ఈనెల 24న కరోనా ప్రభావంపై భారత ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో డాక్టర్ గ్యాని కూడా పాల్గొన్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: