ప్రపంచం మొత్తం గజ గజ వణికిపోతున్న కరోనా మహమ్మారి చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.  అయితే అక్కడ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు.. చైనాలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  చైనా లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా.. ఇతర దేశాల్లో ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్ తర్వాత అమెరికా.. ఇప్పుడు ఇండియా.. ఇలా ఒక్కో దేశాల్లో విలయతాండవం చేస్తుంది.  అయితే మొన్నటి వరకు చైనాలోని పుహాన్ లో కరోనా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే.

 

కరోనా వైరస్ జన్మస్థానంగా  వుహాన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలిసింది. తాజాగా వుహాన్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోవడంతో అక్కడ లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. దాదాపు వందరోజులకు పైగా లాక్ డౌన్ లో ఉక్కిరిబిక్కిరి అయిన అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా బయటికి రావడంతో తీవ్ర కోలాహలం ఏర్పడింది.

 

అక్కడి నుంచి పొరుగున ఉన్న జియాంగ్ షీ ప్రావిన్స్ కు వెళ్లేందుకు ప్రజలు భారీ సంఖ్యలో సరిహద్దు వద్దకు రావడంతో  ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అయితే అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో కట్టలు తెంచుకున్న కోపాన్ని ప్రదర్శించారు. పోలీసులపైన దాడి చేయడమే కాకుండా, వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. హుబేయ్ ప్రావిన్స్ కు, జియాంగ్ షీ ప్రావిన్స్ కు మధ్య ఉన్న ఓ వంతెనను పోలీసులు మూసివేయడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


  

 

మరింత సమాచారం తెలుసుకోండి: