ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే వేలాదిమందిని పొట్టన బెట్టుకుంది. లక్షలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భారత్ లో కరోనా మృతుల సంఖ్య 19 కి చేరుకోగా 850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింద. అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో కరోనా కేసులు కొంత మేరకు తగ్గినా భవిష్యత్తులో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే నిపుణుల హెచ్చరికలు అందరిని ఆందోళనలోకి నెట్టాయి...

IHG

ఇప్పటికే ఢిల్లీ లో కరోనా బాధితులని కొందరు వైద్యులు బ్రతికించారని, కరోనా పాజిటివ్ నుంచీ నెగిటివ్ కి కొందరు రోగులని మార్చగలిగామని కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో కరోనా పై కొద్దిపాటి భయాన్ని పోగొట్టగలిగింది కేంద్రం. కానీ రోజు రోజుకి కరోనా కేసులు ఉద్రుతమవుతున్న నేపధ్యంలో పూర్తి  స్థాయిలో నిర్ధారిత మెడిసిన్ అందుబాటులో రాకపోవడంతో పాటు కేంద్రం ఆర్మీ బలగాలని కొన్ని రాష్ట్రాలకి పంపడంతో ప్రజలలో మరింత ఆందోళన నెలకొంది..ఈ క్రమంలోనే 

IHG

హైదరాబాద్ కి చెందిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమా మిశ్రా కరోనా వైరస్ కి అడ్డుకట్ట వేసే మందుని కనుగొన్నారు. కరోనాపై పోరాడేలా పొటన్షియల్ వ్యాక్సిన్ ని కనిపెట్టారు. కరోనా వైరస్ నిర్మాణం, నిర్మాణేతర ప్రోటీన్ లను ఈ అడ్డుకోనుందని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ ని యోగించే ముందుగ ప్రయోగాత్మక పరీక్ష కోసం టెస్ట్ లకి పంపారు. ఈ వ్యాక్సిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిచడమే కాకుండా శరీరంలో అణువణువున చేరిన కరోనా కణాలని నాశనం చేస్తుందని ప్రకటించారు..ఈ ప్రయోగం గనుకా విజయవంతం అయితే ప్రపంచాన్ని కరోనా భారినుంచీ ఈ ప్రొఫెసర్ కాపడినట్టే 

మరింత సమాచారం తెలుసుకోండి: