కరోనా వైరస్.. ఈ వైరస్ ప్రజలను ఎలా వణికిస్తుందో.. ఈ వైరస్ పై ఇంట్లో ఉండి కామెంట్లు చేసే వారిని చూస్తే కూడా నవ్వు వస్తుంది. నిజానికి కరోనా వైరస్ పై జరిగే తప్పుడు ప్రచారం చూస్తే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉండటం వల్ల మనిషికి ఆలోచనలు ఎక్కువ అయిపోయి.. ఆఫీస్ లో పెట్టాల్సిన శ్రమ అంత కరోనాపై పెట్టి తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ప్రచారం వల్ల వాళ్ళ ఇంట్లో ఎం జరిగింది అనేది ఓ కూతురు చెప్పిన ఘటన కామెడీగా తయారయ్యి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. 

 

అసలు ఎం జరిగింది అంటే? కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ ముక్కల్ని కోసి ఇంట్లో మూలన పెట్టాలని, అలా పెడితే ఉల్లిముక్క నుంచి వచ్చే రసాయనాలు కరోనా వైరస్ ను నాశనం చేస్తాయని అలా మనం ఆ వైరస్ నుండి మనం రక్షించుకోవచ్చు అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంగ్లాండ్ కు చెందిన ఓ విద్యార్థి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

ఒసేని అనే విద్యార్థి తల్లి ప్రతి రోజు ఉల్లిపాయ ముక్కల్ని కోసి అన్ని మూలల పెడుతుంది. అయితే అది చూసిన ఒసేని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ఆమెను ప్రశ్నించగా ఉల్లిపాయలో ఉన్న రసాయనాలు బ్యాక్టీరియాలను నాశనం చేస్తుందని.. కరోనా వైరస్ కూడా సోకకుండా నాశనం చేస్తుంది అని.. అందుకే ఇలా చేస్తున్న అంటూ సమాధానం ఇచ్చారట. దీంతో ఆమె ఒక్కసారిగా నవ్వి.. అది ఫేక్ న్యూస్ అని చెప్పినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ లు నమ్మకండి.. ఇవి చాలా కామెడీ అంటూ పోస్ట్ చేసింది. ఏది ఏమైనా నిజమైన న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఏ బాగా ఎక్కువ మంది చూస్తారు కదా!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: